Anji News
Wednesday, 3 December 2025
ఎంపీడీఓ కార్యాలయం, ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా వ్యయ పరిశీలకులు*
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
*పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు*
*రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని*
*పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్*
*హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా ఎన్నికల వ్యయ, సాధారణ పరిశీలకులు*
-----------------------------
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 03:
------------------------------
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని ఆదేశించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లాల కలెక్టర్ లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్, వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా *రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కుముదిని మాట్లాడుతూ* ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అందేలా రిటర్నింగ్ అధికారి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి ప్రలోభాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు.
నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత పోటీ చేసే అభ్యర్థుల గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ల పై ముద్రణ నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అన్నారు. సింగిల్ నామినేషన్ వచ్చిన గ్రామాలు ఉంటే అండర్ టేకింగ్ తీసుకోవాలని, సర్పంచ్ పదవుల వేలం ప్రక్రియ ఎక్కడ జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఓటర్ స్లిప్పుల పంపిణీకి షెడ్యూలు తయారు చేయాలని, ఓటు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
*ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ* గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అవసరమైన మేర అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.
*ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ,* క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో 6 అంతర్ జిల్లాల చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు.
సమావేశంలో డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ షరీఫుద్దిన్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, నోడల్ అధికారి నవీన్, ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ కార్యాలయం, ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా వ్యయ పరిశీలకులు*
*ఎంపీడీఓ కార్యాలయం, ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా వ్యయ పరిశీలకులు* -------------------------------------------------...
-
*ఎంపీడీఓ కార్యాలయం, ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా వ్యయ పరిశీలకులు* -------------------------------------------------...
